Skip to main content

Featured

జూలై 2022 మేష,వృషభ, మిథున రాశి ఫలములు

మేషరాశి అశ్విని, భరణి, కృత్తిక 1 వ పాదం వారికి
ఈ నెలలో అనుకూల ఫలితాలు ఉన్నాయి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి అవుతాయి. భయపడిన విధంగా తీవ్ర ఆటంకములు ఎదురవ్వవు. జీవిత భాగస్వామి నుండి సహకారం లభించడం వలన సమస్యల నుండి బయట పడతారు. సకాలంలో కుటుంబ సభ్యులకు వైద్య సహాయం అందించగలుగుతారు. ఉద్యోగ, వివాహ మరియు బ్యాంకు రుణ ప్రయత్నాలు చేయుటకు ప్రధమ ద్వితీయ వారాలు అనుకూలమైనవి.

అయితే గృహ నిర్మాణం ప్రారంభించుటకు లేదా కొనుగోలు సంబంద ప్రయత్నాలు చేయుటకు ఈ మాసం కలసిరాదు. ఉద్యోగులకు, వ్యాపార, వృత్తి జీవనం వారికి ధనార్జన పరంగా సాధారణ ఫలితాలు. ఈ మాసంలో 16, 17, 20, 29 మరియు 30 తేదీలు అనుకూలమైనవి కావు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

వృషభరాశి: 

ఈ నెలలో ప్రధమ వారంలో ధనాదాయం బాగుండును. వ్యాపార వ్యవయరాలలో పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. పెద్ద వయస్సు వారికి చేయించే శస్త్ర చికిత్సలు విజయవంతం అవుతాయి. ప్రధమ మరియు ద్వితీయ వారాలలో చేపట్టిన నూతన పనులు వేగంగా పూర్తి అవుతాయి. అవివాహితుల వివాహ ప్రయత్నాలకు, భవిష్యత్ గురించిన ఆలోచనలు గావించడానికి, వృత్తి రహస్యాలు తెలుసుకోవడానికి ఈ మాస ప్రధమ భాగం మంచి అనుకూల కాలం.

తృతీయ వారం సామాన్య ఫలితాలు ఏర్పడతాయి. చివరి వారంలో ఒక చిన్న ప్రమాదం వలన ధననష్టనికి అవకాశం ఉన్నది. మరియు పనిచేసే కార్యాలయంలో తోటి ఉద్యోగుల వద్ద ఇతరుల గురించి మాట జారకుండా ఉండుట మంచిది. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు కొరకు విష్ణు సహస్ర నామాలను చదువుకోవాలి. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

మిథున రాశి :

ఈ నెలలో అన్ని రకముల వ్యాపార వ్యవహారములకు, ఆర్ధిక క్రయ విక్రయాలకు అనుకూలంగా ఉండును. ద్వితీయ వారంలో నూతన గృహ నిర్మాణ ప్రయత్నములు చేయువారికి నిర్మాణ విషయంగా ఆఖస్మిక ఆటంకములు ఎదురవును. ధనాదాయం మాత్రం బాగుండును. విధ్యార్ధులకు వారి ప్రయత్నములు ఫలించి ఆశించిన రంగంలో విద్యాప్రవేశం లభిస్తుంది. తృతీయ వారంలో ఆటంకములు ఎదురైనా పనులు పూర్తీ అవుతాయి.


ఉద్యోగ జీవనంలో ఆకస్మిక చికాకులు ఎదుర్కొంటారు. పెద్ద వయస్సు స్త్రీలను అనారోగ్య సమస్యలు వేధించు సూచన ఉన్నది. బాగా ఎదిగిన సంతానం ప్రవర్తన వలన కూడా మనసు ఆందోళన చెందును. ఈ మాసంలో 21 నుండి 24 వ తేదీల మధ్య ఋణములు కోసం చేయు ప్రయత్నాలు ఫలించును. కుల వృత్తి సంబంధ వ్యాపారములు చేయువారికి ఈమాసం కలసి వచ్చును. గోచార రిత్య అష్టమ శని ప్రభావంతో ఉన్నారు కాబట్టి కాకులకు బెల్లంతో చేసిన గోధుమ రొట్టెలను వేయండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది







.

Comments