Skip to main content

Featured

జూలై 2022 తుల, వృశ్చిక, ధనుస్సు రాశి ఫలితములు

తులారాశి:
ఈ నెలలో ప్రధమ అర్ధభాగం చక్కటి అనుకూల ఫలితాలు, ఆశించిన లాభాలు ఏర్పరచును. నూతన ఆదాయ మార్గాలు ప్రారంభం అగును. సొంత వాహన కొనుగోలు ప్రయత్నాలు ఫలించును. ధనాదాయం ఆశించిన విధంగా బాగుండును. తృతీయ వారం ప్రారంభంలో జీవిత భాగస్వామితో చిన్న తగాదా. మాస ద్వితియార్ధంలో స్థాన చలన సంబంధ ప్రయత్నాలు విఫలం అగును.ప్రస్తుత నివాస గృహాన్ని మార్చవలసి వచ్చును. గొంతు సంబంధ ఆరోగ్య సమస్యలు ఏర్పడుటకు సూచనలు కలవు. కుటుంబ సభ్యులతో వ్యవహరించునపుడు పట్టు విడుపులు అవసరం. ఖర్చు విషయాల గురించి కుటుంబ సభ్యులతో చర్చలు జరపడం మంచిది. చివరి వారంలో శుభవార్తలు వింటారు. దూర ప్రాంత ప్రయానములు ఫలప్రదం అవుతాయి. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు నవగ్రహ స్తోత్రం పాటించాలి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

వృశ్చికరాశి :
ఈ నెలలో నూతన ప్రయత్నాలు విజయవంతం అగును. ఆశించిన శుభ ఫలితాలు ఏర్పడును. సంతాన ప్రయత్నములు మాత్రం కేతు గ్రహం వలన విఫలం అగును. జీర్ణ సంబంధ లేదా నరముల సంబంధ ఆరోగ్య సమస్యలు బాధించు సూచన ఉన్నది. ధనాదాయం ఆశించిన విధంగా బాగుండును. ఈ మాసంలో 8 నుండి 15 వ తేదీల మధ్యకాలంలో వాహన చోదన విషయంలో జాగ్రత్త అవసరం.

ముఖ్యంగా అనురాధా నక్షత్ర జాతకులు జాగ్రత్త వహించాలి. వ్యాపారములందు శ్రద్ధ పెరుగుతుంది. వ్యాపార విస్తరణకు కావలసిన ప్రణాళికలు సిద్ధం చేసుకుంటారు మరియు మూలధనాన్ని సమీకరించుకొంటారు. ధన సమీకరణలో జీవిత భాగస్వామి వలన లాభ పడతారు. 22 వ తేదీ తదుపరి ఉద్యోగస్తులకు చక్కటి ప్రశంసలు లేదా ఉద్యోగంలో ఆశించిన స్థిరత్వం ఏర్పడుతుంది. రాజకీయ రంగంలోని వారు కీర్తిని ఆర్జించ గలుగుతారు. గోమాతకు గ్రాసం పెట్టండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

ధనుస్సు రాశి :
ఈ నెలలో పెద్ద వయస్సు వారికి అనారోగ్య సమస్యలు తగ్గుతాయి. నూతన వ్యవహారాలు ప్రారంభిస్తారు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. ముఖ్యంగా మూలా నక్షత్ర జాతకులు చేపట్టిన కార్యములు విజయవంతం అగును. వివాహ ప్రయత్నాలు ఫలించును. కోరుకున్న వాహనాలు లేదా ఇష్టత కలిగిన ఆభరణాలు కొనుగోలు చేయుటకు ఈ మాసం మంచి కాలం. అన్ని వర్గముల వారికి ఆర్ధిక పరిస్థితి బాగుంటుంది.

వ్యాపార వర్గములకు ఆశించిన ధన ఆదాయం లభిస్తుంది. ఈ మాసంలో ద్వితీయ వారం అనగా 7 నుండి 14 వ తేదీల మధ్య అనుకోని వివాదాల వలన ధనం ఖర్చవుతుంది. 19 నుండి 25 వరకూ ఉన్న కాలం అన్ని విధములా విజయవంతమైన ఫలితాలు ఏర్పరచును. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు మృత్యంజయ జపం చేయడం మంచిది. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

Comments