Skip to main content

Featured

జూలై 2022 కర్కాటకం,సింహ, కన్య రాశి ఫలములు

కర్కాటకం :

ఈ నెలలో ఆర్ధికంగా అనుకూల ఫలితాలు ఉన్నా , ఆరోగ్య విషయాలు చికాకు కలుగచేయును. అనారోగ్య సంబంధ ధన వ్యయం కొనసాగును. ఆశించిన స్థాయిలో పై అధికారులు లేదా తోటి ఉద్యోగుల నుండి సహకారం లభించదు. ఇరుగుపొరుగు వారితో విరోధములు అప్రతిష్టపాలు చేస్తాయి. స్థాన చలన ప్రయత్నాలు కలసి రావు. స్త్రీలకు సదా మానసిక ఆందోళన ఎదురగు సూచన ఉన్నది. ముఖ్యంగా 17, 18 తేదీలలో వాహన ప్రమాదమునకు సూచనలు అధికం. 19 వ తేదీ తదుపరి వృత్తి ఉద్యోగ ప్రయత్నాలు చేయడానికి , వ్యాపార విస్తరణకు అనుకూలమైన కాలం ఆరంభం అవుతుంది.

అన్నివిధములా పరిస్థితులు చక్కబడతాయి. మొత్తం మీద ఈ మాసంలో సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకొనుట మంచిది కాదు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

సింహ రాశి :

ఈ నెలలో రక్తసంభందీకుల వలన మీ ఆలోచనలు కార్యరూపం దాల్చును. ఈ మాసంలో ధనాదాయం సామాన్యం. గృహంలో సంతోషకర వాతావరణం ఉంటుంది. వివాహ ప్రయత్నములు కలసివచ్చును. ఉద్యోగ మార్పుప్రయత్నాలు విజయవంతం అగును. ప్రతీ విషయంలో తీవ్రంగా ఆలోచన చేయుట పనికిరాదు. మీపై అందరూ సానుభూతి ప్రదర్సించాలి అనే కొరిక సమస్యలకు దారితీయును.

వృద్దులకు శ్వాస సంబంధ , నేత్ర సంబంద సమస్యలు ఎదురగును. తృతీయ వారంలో మీ పై అధికారులను ప్రతిభతో ఆకట్టుకుంటారు. వారి నుండి గౌరవ మర్యాదలు పొందేదురు. ఉద్యోగ లక్ష్యం సిద్ధిస్తుంది. చివరి వారం ప్రశాంతంగా గడుపుతారు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

కన్యారాశి :

ఈ నెలలో సంతాన సంబంధ ప్రయత్నాలు లాభించును. ధనాదాయం సామాన్యం. గృహంలో స్త్రీ సంతాన సంబంధ శుభకార్యములు నిర్వహిస్తారు. దూర దేశములందు పనిచేస్తున్న ఉద్యోగస్తులకు ఆఖస్మిక ఉద్యోగ నష్టం. వ్యాపార రంగంలోని వారు ఆశించిన విధంగా లాభం పొందుతారు. తృతీయ వారం నుండి పనిలో ఉత్సాహకర సమయం ప్రారంభం అవుతుంది.


చివరి వారంలో ఉద్యోగ నష్టం ఎదుర్కొన్న వారికి కెరీర్ పరంగా నూతన అవకాశాలు లభిస్తాయి. చివరి వారం అవివాహితులకు కూడా వివాహ అనుకూలత కలుగచేయు సూచన ఉన్నది. అయితే ఈ మాసం అధికారులను కలువుటకు, కుటుంబ సమస్యల్లో మధ్యవర్తిత్వానికి అనుకూల కాలం కాదు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గరికతో గణపతికి పూజ చేయండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

Comments