Skip to main content

Featured

జూలై 2022 మకర, కుంభ,మీన రాశి ఫలితములు

మకర రాశి :
ఈ నెలలో ఉద్యోగ, వ్యాపార వృత్తి జీవనం వారికి సామాన్య ఫలితాలు ఎదురగును. విద్యా సంబంధ వ్యాపారములు చేయు వారికి అతి చక్కటి లాభములు లభించును. నిరుద్యోగుల ఉద్యోగ అన్వేషణ ఫలించును. నూతన వ్యాపార ప్రారంభాలకు లేదా నూతన ఆలోచనలు కార్యాచరణలో పెట్టుటకు ధనం సకాలంలో అందుతుంది. తృతీయ వారం నుండి నిరంతరం కష్టించి పనులు సకాలంలో పూర్తి చేయుదురు.

పదోన్నతి పొందుటకు కార్యాలయంలో వాతావరణం ఉత్సాహపూరితంగా ఉండును. నూతన వస్తువులు గృహంలో సమకుర్చుకుంటారు. వ్యక్తిగత జీవితంలో సమస్యలకు పరిష్కారం లభించును. మాసాంతంలో విందు వినోదాలు, కుటుంబ మిత్రులతో కలయికలు. ఆహ్లాదకరమైన సమయం ఎదురగును. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు ప్రతీ రోజూ రావి చెట్టుకు 'ఓం నమో భగవతే వాసుదేవాయ' అని స్మరిస్తూ 11 ప్రదక్షిణలు చేయండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

కుంభరాశి:
ఈ నెలలో లాభాపురితంగా ఉంటుంది. ధనాదాయం బాగుండును. నిరుద్యోగుల ఉద్యోగ ప్రయత్నములు లాభించును. దూర ప్రాంత ఉద్యోగ లేదా విదేశీ నివాశ ప్రయత్నాలు కూడా ఫలించును. సంతాన ప్రాప్తి కోసం వైద్య పరంగా ధనం ఖర్చు అగును. ద్వితీయ తృతీయ వారములలో శుభవార్తలు వింటారు. చివరి వారం అంత అనుకూలంగా ఉండదు.

జ్వరతత్వ ఆరోగ్య సమస్యలు బాధించును. ఆలోచనలు అదుపులో ఉండవు. నష్టపురిత ఆలోచనలు అధికంగా చేయుదురు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

మీనరాశి :
ఈ నెలలో కొద్దిపాటి సమస్యలు, పని ఒత్తిడులతో ప్రారంభం అగును. మీ ఊహా శక్తి ఈ మాసంలో అనుకూలంగా పనిచేయదు. వివాహ ప్రయత్నాలలో విఘ్నాలు ఎదురగును. సొంత మనుషుల వలన వివాహ సంబంధాలు విఫలం అగుట తీవ్ర ఆవేదనకు గురిచేస్తుంది. కుటుంబ అనారోగ్య సమస్యలు అధిక వ్యయమును కలుగ చేస్తాయి. ద్వితీయ వారం చివరి వరకూ నూతన ప్రయత్నాలు సఫలం అగుట కష్టం.

బంధు వర్గంతో విరోధాలు ఎదుర్కొందురు. తృతీయ వారం నుండి ధనాదాయం బాగుండును. జీవనంలో లాభకరమైన పరిస్థితులు ఎదురగును. తిరిగి మనోబలం పెరుగును. మిత్ర వర్గంతో సర్దుకుపోవుట మంచిది. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు సూర్య దేవుని ఆరాధన చేయండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

Comments