Featured
- Get link
- X
- Other Apps
*నవగ్రహ శాంతి పరిహరములు*
*నవగ్రహాలు శాంతి పరిహారాలు*
నవగ్రహాలలో ప్రతి ఒక్కరి జాతకంలోని కొన్ని గ్రహాలు అనుకూలంగా ఉంటాయి మరి కొన్ని గ్రహాలు ప్రతికూలంగా ఉంటాయి.ప్రతికూల గ్రహాల వలన చాలా రకాల సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు.జాతక చక్రమును పరిశీలించి ఏ గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయో వాటికి చిన్నచిన్న పరిహారాలు చేసుకోవడం వలన కొంత ఉపశమనం జరుగుతుంది.గ్రహాలు మరింత బలహీనంగా ఉన్నప్పుడు వాటికి కాస్త పెద్ద పరిహారాలు చేయవలసి ఉంటుంది ఈ పరిహారాలు జాతక చక్రమును అనుసరించి కేవలం జ్యోతిష్యుడు చెప్పిన విధంగా మాత్రమే చేయవలసి ఉంటుంది.ఈ క్రింది చెప్పిన పరిహారాలు వలన తాత్కాలికంగా మరియు కొంతవరకు గ్రహాల నుండి ప్రతికూలతను తగ్గించుకోవచ్చును.
గ్రహాలకు సంబంధించిన వారం నాడు, మూట గట్టిన నవధాన్యాలు వేపచెట్టుకి కట్టాలి. ఆ గ్రహానికి సంబంధించిన ధాన్యం నానబెట్టి ఒక పిడికెడు పరిమాణంలో ఆవుకు పెట్టాలి.ఆవుకు పెట్టేముందు ఆవు యొక్క యజమాని అనుమతి తీసుకుని పెట్టవలసి ఉంటుంది.ఒక్కొక్కసారి గోవు చూలు అయి ఉండవచ్చు లేదా ఆరోగ్య పరంగా ఇబ్బంది అయి ఉండవచ్చు. అటువంటి సమయంలో ఆ గోవుకు పెట్టిన ఆహారం వలన అది ఇబ్బందికి గురి అయితే పెట్టిన వారికి వ్యతిరేక ఫలితాలు వచ్చే అవకాశం ఉన్నది కావున యజమాని అనుమతి తీసుకుని మాత్రమే ఆవుకి పెట్టవలసి ఉంటుంది.ఈ విషయంలో జాగ్రత్త వహించ వలసినదిగా గ్రూపు సభ్యులకు సూచన.
గ్రహాలు – వివరాలు
1. సూర్యుడు – ఆదివారం
ధాన్యం : గోధుమలు
పుష్పం : తామర
వస్త్రం : ఎర్రని రంగు గల వస్త్రం
జాతి రాయి : కెంపు
2. చంద్రుడు – సోమవారం
బియ్యం.
పుష్పం : తెల్లని తామర
వస్త్రం : తెల్లని వస్త్రం
జాతి రత్నం : ముత్యం
నైవేద్యం : పెరుగన్నం
3. కుజుడు – మంగళవారం
ధాన్యం : కందిపప్పు
పుష్పం : సంపంగి మరియు తామర
వస్త్రం : ఎరుపు రంగు వస్త్రం
జాతి రత్నం : ఎర్రని పగడం
నైవేద్యం : కందిపప్పు తో కూడిన అన్నం
4. బుధుడు – బుధవారం
ధాన్యం : పచ్చ పెసర పప్పు
వస్త్రం : పచ్చని రంగు వస్త్రం
జాతి రత్నం : పచ్చ
నైవేద్యం : పెసరపప్పు తో కూడిన అన్నంఅన్నం
5. గురు – గురువారం
ధాన్యం : సెనగ పప్పు
పుష్పం : మల్లె
వస్త్రం : బంగారు రంగు వస్త్రం
జాతి రత్నం : పుష్య రాగం
నైవేద్యం : సెనగపప్పు తో కూడిన అన్నం
6. శుక్రుడు – శుక్రవారం
ధాన్యం : బొబ్బర్లు
పుష్పం : తెల్లని తామర
వస్త్రం : తెల్లని వస్త్రం
జాతి రత్నం : వజ్రం
నైవేద్యం :బొబ్బర్లు తో కూడిన అన్నం
7. శని – శనివారం
ధాన్యం : నల్ల నువ్వులు
వస్త్రం : నల్లని వస్త్రం
జాతి రత్నం : నీలం
నైవేద్యం : నల్లని నువ్వులు కలిపిన అన్నం
8. రాహువు – శుక్రవారం
ధాన్యం : మినుగులు
పుష్పం : అడవి మందారం
జాతిరత్నం : గోమేదికం
వస్త్రం : నల్లటి వస్త్రం
నైవేద్యం : మినువులతో కూడిన అన్నం
9. కేతువు – మంగళవారం
ధాన్యం : ఉలవలు
పుష్పం : ఎర్రని కలువ
వస్త్రం : రంగురంగుల వస్త్రం
జాతి రత్నం : వైడూర్యం
నైవేద్యం : ఉలవల అన్నం.
- Get link
- X
- Other Apps
Comments
Post a Comment